‘క్రైమ్‌’ కలవరం!

'క్రైమ్‌' కలవరం!



సాక్షి, నిర్మల్‌: నిర్మల్‌.. పేరుకు తగ్గట్టుగా ప్రశాంతంగా ఉండే జిల్లా. అలాంటి జిల్లాలో నెలరోజులుగా ఏదో ఒక ఘటన కలవర పెడుతూనే ఉంది. వరుసగా జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు జిల్లాలో కలకలం రేపుతున్నాయి. పొన్కల్‌లో గోదావరిలో లభ్యమైన మృతదేహం వెనుక ఉన్న మిస్టరీని మరచిపోకముందే.. తల్వేద చెరువులో మహిళ మృతదేహం గోనెసంచిలో లభ్యమైంది. ఇదిలా ఉండగా, ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దారుణంగా చనిపోయాడు. ఇలా.. క్రైమ్‌ సీరియల్‌ మాదిరి ఈనెలలో వరుసగా నేరఘటనలు చోటు చేసుకున్నాయి. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, దొంగతనాలు, కొట్లాటలతో ఇది క్రైమ్‌సీజన్‌గా మారింది. పోలీసులకూ ఈ సీజన్‌ సవాల్‌గానే సాగుతోంది.