భారీగా తగ్గిన పెట్రో ధరలు

పెట్రోలు, డీజిల్‌ ధరలు దేశవ్యాప్తంగా దిగి వస్తున్నాయి. వరుసగా మూడవరోజుకూడా పెట్రోలు డీజీలు క్షీణించాయి. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ఈ రోజు పెట్రోలుపై 24 పైసలు, డీజిల్‌పై  27 పైసలు ధర  తగ్గింది. దీంతో మొత్తంగా  ఫిబ్రవరిలో  పెట్రోల్ లీటరుకు 82 పైసలు,  డీజిల్ లీటరుకు 85 పైసలు తగ్గింది. జనవరి 12 నుండి ఇంధన రేట్లు తగ్గడం ప్రారంభించిన సంగతి తెలిసిందే.


కరోనా వైరస్‌ ప్రకంపనలు ముడిచమురు ధరలను కూడా తాకాయి. చమురుకు డిమాండ్‌ ఎక్కువుండే చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తితో చమురు వాణిజ్యం తీవ్రంగా ప్రభావితమైంది. దీంతో అంతర్జాతీయంగా ముడి చమురు ధర గత వారం పడిపోయింది. వారంలో వరుసగా ఐదవ క్షీణతను నమోదు చేసింది. బ్రెంట్ ముడి బ్యారెల్‌ 54.50 వద్ద ట్రేడవుతోంది.