ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి నిరోధక చర్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు. కరోనా విషయంలో ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు ప్రకటించనుంది. కొద్ది సేపటి క్రితం అధికారులు, మంత్రులతో సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో అనేక ప్రతిపాదనలు వచ్చాయి. మంత్రివర్గ సమావేశంలో వీటిపై తుది నిర్ణయం తీసుకుంటారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మీడియా సమావేశం నిర్వహించి నిర్ణయాలను వెల్లడించనున్నారు.