న్యూయార్క్‌లోని బ్రాంక్స్ జూలో ఓ పులికి కరోనా పాజిటివ్ రావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మనుషులను అదుపు చేయలేక సతమతమైపోతున్న ఈ తరుణంలో జంతువులలో కరోన వ్యాపిస్తే ఇంకేమైనా ఉందా? అందుకే భారత్ లోని జూపార్కుల నిర్వాహకులను సెంట్రల్ జూ అథారిటీ అప్రమత్తం చేసింది. జంతువులను 24 గంటలు సీసీటీవీల్లో కనిపెట్టాలని, ఏదైనా అసాధారణ ప్రవర్తన కనిపిస్తే వెంటనే తగిన చర్యలు చేపట్టాలని సూచించింది. ఏదైనా అనారోగ్యం ఉన్నట్టు కనిపిస్తే రక్త నమూనాలను సేకరించి నిర్దేశిత పరీక్షా కేంద్రాలకు పంపాలని ఆదేశించింది. సంరక్షకులు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత భద్రతా పరికరాలు లేకుండా నేరుగా జంతువుల దగ్గరకు వెళ్లరాదని అథారిటీ సోమవారం విడుదల చేసిన మార్గదర్శకాలలో స్పష్టం చేసింది. పిల్లులు, కోతులు తదితర పాలిచ్ జంతువుల విషయంలే నిగా తప్పక వేసి ఉంచాలని పేర్కొన్నది. అయితే పిల్లుల వంటి పెంపుడు జంతువుల విషయంలో పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపింది.
న్యూయార్క్ జూలో పులికి కరోనా.. భారత్‌లో జూపార్కులు అప్రమత్తం