సహాయం చేయాలని కేటీఆర్‌ ట్విట్‌: స్పందించిన పోలీసులు

గర్భిణీకి సహాయం చేయాలని కేటీఆర్‌ చేసిన ట్విట్‌కు పోలీసులు స్పందించి ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. వివరాల్లోకి వెళితే జిల్లాలోని లక్సెట్టిపేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొమ్ముగూడెం గ్రామానికి చెందిన మహేశ్‌ వృత్తిరిత్య వైజాగ్‌లో ఉంటున్నాడు. ఆయన భార్య మౌనిక గర్భిణీ. లాక్‌డౌన్‌ కారణంగా వైద్య సహాయం కోసం ఆస్పత్రికి వెళ్లడానికి ఎలాంటి వాహన సౌకర్య లేదు. ఇంటి వద్ద తన భార్య ఇబ్బంది పడుతుందని తన సమస్యను వివరిస్తూ మహేశ్‌ మంత్రి కేటీఆర్‌కు ట్విట్‌ చేశాడు. 


ట్విట్‌కు స్పందించిన కేటీఆర్‌ సహాయం చేయాలని స్థానిక సీఐ నారాయణనాయక్‌కు  రిట్విట్‌ చేశారు. వెంటనే స్పందించిన సీఐ, ఎస్సై దత్తాత్రి, పోలీసు సిబ్బంది గ్రామానికి చేరుకుని మహిళను ఆస్పత్రిలో చేర్పించారు.  కేటీఆర్‌ ట్విట్‌కు స్పందించి సహాయం చేసిన లక్సెట్టిపేట పోలీసులకు వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.